బాబు సొంతింట్లో టీడీపీ జెండా క‌ష్ట‌మేనా..!     2018-05-30   01:05:31  IST  Raghu V

విప‌క్షం వైసీపీ నుంచి 2014లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి. అధికార పార్టీ టీడీపీ నేత‌ల‌కు ఈ పేరంటేనే పెద్ద వివాదం! ఈ పేరు విన‌బడితే.. అసెంబ్లీ వంటి ప్రాంగ‌ణాల్లో ఈయ‌న క‌నిపిస్తే.. టీడీపీ నాయ‌కులు ఎవ‌రికి వారు జాగ్ర‌త్త ప‌డిపోతారు. మ‌రి అలాంటి నాయ‌కుడిపై చంద్ర‌గిరి ఎమ్మెల్యేలు ఏమ‌నుకుంటున్నా రు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెవిరెడ్డిని గెలిపిస్తారా? లేక ఆయ‌న దూకుడుతో త‌ట్టుకోలేక ప‌క్క‌న పెడ‌తారా? ఇలాంటి ఆస‌క్తిక‌ర అంశాల‌పై దృష్టి పెడితే.. మ‌రింత ఆస‌క్తిక‌ర స‌మాధానం ల‌భిస్తోంది. ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. కూడా త‌న సొంత వ్యాపారాల నుంచి వ‌స్తున్న డ‌బ్బును ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుకు మ‌ళ్లిస్తున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. అధికార పార్టీ నేత‌లపై విరుచుకు ప‌డుతున్నారు.

దీంతో చెవిరెడ్డికి ఫాలోయింగ్ పెరుగుతోంది. అభివృద్ధి చేయ‌లేక‌పోయారు క‌దా? అని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌శ్నిస్తే.. ఏది ఆయ‌న అధికార పార్టీలో లేడు క‌దా? అంటూ ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా మొత్తంగా చెవిరెడ్డి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చొచ్చుకుపోయారు. సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్‌ నుంచీ రూ. 56 లక్షలతో పంచాయతీలకు 8 ట్రాక్టర్లు, 8 ట్యాంకర్లు మంజూరు చేయించారు.జాతర్లకు, ఉత్సవాలకు విరాళాలివ్వడం, వినాయక చవితికి విగ్రహాలు పంపిణీ చేయడం, క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించడం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులివ్వడం తరహా కార్యక్రమాలతో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.