బాబు వ్యూహంతో క‌న్న‌డ‌నాట బీజేపీకి చుక్క‌లే     2018-04-25   00:03:57  IST  Bhanu C

మోదీ వ‌ద‌ల.. నిన్నొద‌ల అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు! ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోగాక‌, విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌లేద‌ని ఎన్డీఏ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆయ‌న‌.. బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. ఏపీకి బీజేపీ నేత‌ల‌తో పాటు ప్ర‌ధాని మోదీ తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని స‌మ‌యం దొరికిన‌ప్పుడల్లా ఏకిపారేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు ప‌ట్టిన గ‌తే బీజేపీకీ ప‌ట్టేలా చేయ‌డంలో సక్సెస్ అయ్యారు. ఏపీలో ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయేలా చేశారు. ఇప్పుడు ప‌క్క రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌లోనూ బీజేపీని వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.

క‌ర్ణాట‌క‌లో గెలుపు కోసం బీజేపీ పెద్ద‌లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతు న్నారు. క‌ర్ణాట‌క‌లో తెలుగువారు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపించాల‌ని భావిస్తున్నార‌ట‌. తెలుగువారి స‌త్తా మోడీకి చూపించాల‌ని బాబు పావులు క‌దుపుతున్నార‌ట‌.
క‌ర్ణాట‌క రాజ‌కీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. నువ్వా-నేనా అంటూ పోటీ ప‌డుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇలా కత్తులు దూసుకుంటుంటే.. బీజేపీని దెబ్బకొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు.