బాబు పై రెచ్చిపోయిన ముద్రగడ ! ఘాటుగా లేఖ !     2018-05-29   01:46:16  IST  Bhanu C

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో సారి రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయా వాతావరణం వేడిక్కింది. మహానాడు జరుగుతున్న సమయంలో ముద్రగడ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి.

‘నీకు పిల్లనిచ్చి వివాహం జరిపించిన ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించావ్‌. ఇప్పుడేమో ఓట్ల కోసం చెప్పులు విడిచి ఆయన విగ్రహానికి ఒంగి ఒంగి దొంగ నమస్కారాలు పెడుతున్నావ్‌’ అంటూ సీఎం చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. హామీలను నెరవేర్చాలని అడిగితే.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు.