బాబు ని టెన్షన్ పెడుతున్నఆ ఇద్దరు !     2018-05-24   02:23:43  IST  Bhanu C

ఎప్పడూ లేనటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. నాలుగు ప్రధాన పార్టీలు ఎన్నికల్లో తలపడనున్నాయి. అలాగే ఎన్నికల సమయం కూడా సమీపిస్తుండడంతో జనాల్లో చొచ్చుకెళ్లేందుకు అన్ని పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. ఈ దశలో ఇప్పడు అధికార పార్టీ తెలుగుదేశాన్ని రెండు పార్టీలు కంగారు పెట్టిస్తున్నాయి. ఒక వైపు వైసీపీ మరోవైపు జనసేన అధినేతలు ఇద్దరూ జనం నాది పట్టి వాటిని ఓట్లుగా మలుచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ పై అవినీతి విమర్శలు బలంగా చేస్తుండడంతో ఆ పార్టీ కలవరపెడుతోంది.

వైసీపీ అధినేత చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో టీడీపీని విమర్శించడంతో పాటు ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ .. వాటి గురించి ప్రభుత్వాన్ని జనం మధ్యనే నిలదీస్తూ .. విమర్శించడంతో ప్రజల నుంచి విపరీతమైన స్పందన కనిపిస్తోంది. దీంతో అటు ప్రజల్లోనూ.. ఇటు పార్టీ కార్యకర్తల్లోనూ మంచి జోష్ కనిపిస్తోంది ఆ పార్టీకి. పనిలో పనిగా అదే సమయంలో ఎక్కడికక్కడ పార్టీలో చేరికలు ఉండేలా జగన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. పాదయాత్ర ముగిసేనాటికి భారీ స్థాయిలో చేరికలు ఉండేలా చూసుకుంటున్నాడు.