బాబుతో క‌టీఫ్ ఎఫెక్ట్.. క‌వ‌రేజ్‌పైనా పడిందిగా ప‌వ‌న్‌     2018-06-01   02:06:12  IST  Bhanu C

జ‌న‌సేనాని ప్ర‌జ‌ల్లోకి రాక ముందు వ‌ర‌కూ ఆయ‌న ఏది మాట్లాడినా.. అది మీడియాలో ఎంతో హైలైట్ అయ్యేది. ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టినా, బ‌హిరంగ స‌భ పెట్టినా, ఎక్క‌డికైనా వెళ్లినా.. కెమెరాల‌న్నీ ఆవైపే ఉండేవి. ఏ చాన‌ల్ చూసినా ప‌వ‌న్ మాత్ర‌మే క‌నిపించేవాడు. చానల్స్ అన్నీ హ‌డావుడి చేస్తూ క‌వ‌రేజ్ ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌ని తేలిపో యింది. ప‌వ‌న్ శ్రీ‌కాకుళం జిల్లాలో నిర్వ‌హించిన పోరాట యాత్ర‌కు మీడియా క‌వ‌రేజ్ చూస్తే ఈ విష‌యం ఇట్టే ప‌సి గ‌ట్టేయ‌చ్చు! ఏదో ప‌వ‌న్‌ను కూడా చూపించాలి కాబ‌ట్టి.. మ‌రి ఇంతోనే ఎంత మార్పు ఎలా సాధ్య‌మైంది? మీడియా ప్రాధాన్యం ఎందుకు ఇలా మారిపోయింది? జ‌న‌సేనాని ఎక్కువగా మీడియాలో క‌నిపిస్తే టీఆర్‌పీ రేటింగులు పెరుగు తాయ‌ని తెలిసినా ఎందుకు మీడియా ప‌క్క‌న పెట్టేసింది? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జ‌మే. అయితే దీనికి ఒకే ఒక్క కార‌ణం టీడీపీతో దోస్తీ క‌టీఫ్ అయిపోవ‌డ‌మేన‌ట‌. మ‌రి ఈ రెండింటికీ లింకేంటి అంటే..