బంగ్లా కాలీ చేయమంటే ఆ మాజీ సీఎం ఏం చేసారో చూస్తే షాక్.!     2018-06-11   00:58:17  IST  Raghu V

యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ జూన్‌-2న తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో అఖిలేశ్‌ ఖాళీ చేసిన విక్రమాదిత్య మార్గ్‌లోని బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి శనివారం(జూన్-9) ఉదయం మీడియాతో సహా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ అధికారులు షాక్‌కు గురయ్యారు. అంత షాకింగ్ గా అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారా.? వివరాలు మీరే చూడండి!

ఆ బంగ్లాలో ఉన్న ఖరీదైన వస్తువులు, సామాగ్రిని అఖిలేష్ యాదవ్ కుటుంబం సభ్యులు తీస్కెళ్లారు. దీనిపై అధికారులు తప్పుపట్టారు. ప్రజాధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. స్విమ్మింగ్‌పూల్ కోసం టర్కిష్ నుంచి దిగుమతి చేసుకున్న టైల్స్, ఫ్లోర్స్ కోసం కొనుగోలు చేసిన ఖరీదైన ఇటాలియన్ మార్బుల్స్‌ను తవ్వి తీస్కెళ్లారు.