ఫ్రెండ్ భర్త మీద కామంతో ఈ అమ్మాయి ఏం చేసిందో చూడండి

కామం తురానామ్ నా సిగ్గు నా లజ్జ అన్నారు ఓ సినిమాలో. దీన్ని బూతులా చూడకుండా అర్థం చేసుకుంటే ప్రేమ, కామంతో ఉన్నవారు, తమకు నచ్చిన వ్యక్తిని దక్కించుకోవడానికి ఏదైనా వదిలేస్తారు, అలాగే ఎందైకైనా వెళతారు. ఇదే దానిలో ఉన్న పరమార్థం. ఓ 26 ఏళ్ల అమ్మాయి కూడా ఓ మగవాడి మీద మోజు పడింది. అందులో తప్పేముంది అనుకుంటున్నారా. పెళ్ళైన మగవాడి మీద మోజు పడింది. అది కూడా తన స్నేహితురాలి భర్త మీద. ఇక్కడ మీకు తెలియాల్సిన మరో ట్విస్టు ఏమిటంటే, ఈ 26 ఏళ్ల అమ్మాయి వృత్తిపరంగా ఒక పోలీసు. తన జాబ్ ని ఉపయోగించుకొనే అడ్డదారులు తొక్కి, ఆ మగవాడిని దక్కించుకునేందుకు విఫలయత్నాలు చేసింది.

వివరాల్లోకి వెళితే 26 ఏళ్ల ఆశ్లే బాయిడ్ లనర్క్ షైర్ లో ఓ పోలీసుగా పనిచేస్తోంది. ఆమె స్నేహితురాలి పేరు రోనా. ఆ స్నేహితురాలి భర్త పేరు కెవిన్. రోనా పెళ్లి కాకముందు, బాయిడ్ పోలీసు కాకముందు ఇద్దరు ఒకేదగ్గర బూట్స్ లో పనిచేసేవారు. కెవిన్ కి ఈ ఇద్దరు మాత్రమే కాదు, ఈ స్నేహితురాళ్ళ బ్యాచ్ లో ఇంకొంతమంది లైన్ వేసినా, కెవిన్ రోనా ప్రేమకే పడిపోయాడు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ గ్యాంగ్ లో మిగితవారు సైలెంట్ అయిపోతే, బాయిడ్ మాత్రం కెవిన్ పై పెంచుకున్న కామాన్ని/ ఇష్టాన్ని చంపుకోలేకపోయింది. పోలీసు ఉద్యోగం వచ్చాక కెవిన్ కి వెళ్ళే జిమ్ కే వెళ్లి, అక్కడ తనతో స్నేహం పెంచుకుంది. తన భార్య స్నేహితురాలే కదా అని కెవిన్ చనువిచ్చాడు. ఆ తరువాత ఇద్దరి పెళ్లి చెడగొట్టేందుకు బాయిడ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కెవిన్ కి ఫోన్ చేస్తే, నా అకౌంట్ నాకు ఓపెన్ కావడం లేదు, ఎవరో పాస్ వర్డ్ మార్చేసారు అని సమాధానం. దాంతో ఎకౌంట్స్ హ్యాక్ అయ్యాయని అర్థం అయ్యింది.

కెవిన్ ఫేస్ బుక్ అకౌంట్ తో పాటు, ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేయించింది బాయిడ్. ఆ రెండు అకౌంట్స్ యొక్క పాస్ వర్డ్ మార్చేసింది. ఆ సమయంలో రోనా-కెవిన్ హాలిడేకి వెళ్ళారు. వారికి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియదు. ఇక అకౌంట్స్ ని తీసుకున్న బాయిడ్, కెవిన్ లాగా పోస్ట్ చేస్తూ, నాకు నా భార్య అంటే విరక్తి పుట్టింది, సంతోషం లేకుండా పోయింది అంటూ పోస్టులు పెట్టింది, కెవిన్ స్నేహితులకి పర్సనల్ గా రోనాని తిడుతూ మెసేజ్లు పెట్టింది. ఇదంతా చూసిన స్నేహితులు షాక్, ఎందుకంటే ఇద్దరు సంతోషంగానే హాలిడేకి అని వెళ్ళారు కదా, ఇంతలోనే ఏమైందో వారికి అర్థం కాలేదు.

హ్యాక్ చేసింది ఎవరా అని విచారణ మొదలుపెడితే, అతికష్టం మీద బాయిడ్ పేరు బయటకి వచ్చింది. ఆమె మీద కేసు వేసారు దంపతులు. ఒక పోలీసు ఆఫీసరు ఇలా చేయడంతో విషయం సీరియస్ అయ్యింది. బాయిడ్ కి వచ్చే నెలలో పెద్ద శిక్ష వేయనుంది కోర్టు.