ప‌వ‌న్ కు బ్యాడ్ టైం స్టార్ట‌యిందా..?     2018-05-27   01:25:48  IST  Bhanu C

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు బ్యాడ్ టైం స్టార్ట‌యిందా? ఆయ‌న‌కు ఏపీలో అధికార పార్టీ నుంచి కానీ, ప్ర‌భుత్వం నుంచి కానీ ఆశించిన మేర‌కు ఎలాంటి గుర్తింపూ ల‌భించ‌డం లేదా? ఈ ప‌రిణామాలు జ‌న‌సేన‌ను కుదేలయ్యేలా చేస్తున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. అంతేకాదు, ఇప్పుడున్న ప‌రిస్థితిలో సీఎం చంద్ర‌బాబు.. ప‌వ‌న్‌కు అప్పాయింట్ మెంట్ కూడా ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర జిల్లా అయిన శ్రీకాకుళంలో ప‌ర్య‌టిస్తున్నారు.

అక్క‌డే 45 రోజుల పాటు ఆయ‌న బ‌స్సు యాత్ర నిర్వ‌హిస్తారు. అక్క‌డి స‌మ‌స్య‌ల‌పై పోరుగ‌ళం వినిపిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా మ‌ళ్లీ ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌లు భుజాన వేసుకున్నారు. గ‌తంలోనే తాను ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లాన‌ని, అయితే, ప్ర‌భుత్వం మాత్రం ఈ స‌మ‌స్య‌ను ప‌ట్టించు కోకుండా ప‌క్క‌న పెట్టింద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో మ‌రో 48 గంట‌ల గ‌డువు ఇస్తున్నాను. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స్పందించి ఉద్దానం కిడ్నీ బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని ప‌వ‌న్ రెండు రోజుల కింద‌ట డిమాండ్ చేశాడు.