ప్రేమించిన అమ్మాయి/అబ్బాయిని చూడగానే గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది?

గుండె బలహీనంగా ఉన్నవారికి ప్రేమ ఓరకంగా ప్రమాదమే. ఇలా సడెన్ గా రక్త ప్రసరణలో మార్పులు జరిగితే వారి గుండెకి ప్రమాదమే. సహజంగా కుర్రవయసులోనే ప్రేమలో పడతారు కాబట్టి ఈ కారణంతో మనుషులు ప్రమాదంలో పడటం గురించి మనం పెద్దగా వినలేదు. ఇలాంటి ఫీలింగ్స్ లేట్ వయసులో వస్తే ఇంకేమైనా ఉందా, హార్ట్ రేట్ పెరిగిపోయి, రక్త నాళ్ళాల్లో ఎక్కువ ఆక్సిజన్ నిదిపోయి, అవి బ్లాక్ అయిపోయి, గుండె ఆగిపోయినా ఆగిపోతుంది.

చూసారా ప్రేమ ఎన్ని వింతలు చేస్తుందో. మరి ఊరికే ప్రేమించిన వారి కోసం అంతలా మధన పడతారా జనాలు. ఇలా జరక్కూడదు అంటే ప్రేమించిన వారిని కూడా ఓ మామూలు మనిషిలానే చూడాలి. అప్పుడే, మిగితా వారిని చూసినప్పుడు ఎలాగైతే మామూలుగా ఉంటామో, అలాగే ఉంటాము.