ప్రేమించిన అమ్మాయి/అబ్బాయిని చూడగానే గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుంది?

ఉన్నట్టుండి గుండె, వంద కొట్టుకుందే, ఎవ్వరంటా ఎదురైనది … ఈమధ్య వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా మజ్నూలోని పాట ఇది. ఇలా నిజంగానే జరుగుతుందా? మనకు ఇష్టమైన వ్యక్తీ కనుల ఎదురుగా కనబడగానే గుండె నిజంగానే వేగంగానే కొట్టుకుంటుందా? ఎందుకు కొట్టుకోదు, నిజంగా ప్రేమలో ఉంటే నిజంగానే కొట్టుకుటుంది అంటారు ప్రేమికులు. అవును, ఇష్టమైన అమ్మాయి/అబ్బాయి కనబడినా, వారి పేరు వినబడినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాని ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ కనెక్షన్ ఏమిటి? దీని వెనుక సైన్స్ ఏమిటి?

దీన్నే సైంటిఫిక్ భాషలో Adrenaline Rush అని అంటారు. ఎప్పుడైతే మీరు మీకు బాగా ఇష్టమైన వ్యక్తీ, అంటే ప్రేమించిన వ్యక్తీని చూస్తారో, వారితో మాట్లాడతారో, ఆ హాయిని మాటల్లో వర్ణించడం కష్టం. అలాంటి హాయిలో Adrenal gland నుంచి adrenaline, epinephrine మరియు norepinephrine అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, మీ రక్త ప్రసరణ పెంచుతుంది. దాంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇందులో అనే హార్మోన్ వలన స్ట్రెస్ ఏర్పడి, మోకాళ్ళు వీక్ గా అనిపించడమే కాదు, చెమటలు కూడా పడుతూ ఉంటాయి. హాయి, స్త్రీ, ఒత్తిడి .. ఇలా రకరకాల ఎమోషన్స్ ని చూస్తాం మనం ఆ సమయంలో. అందుకే ఇలా జరుగుతుంది.