ప్రాణాలు తీసిన వాట్సప్ గ్రూప్..     2018-06-06   01:36:50  IST  Raghu V

సోషల్ మీడియాలో స్వేఛ్చ పేరుతో పెట్రేగి పోతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు..ఒక కులాన్ని ఒకడు దూషిస్తే అదే కులాన్ని మరొకడు కించపరుస్తూ ఇది మా స్వేఛ్చ అని చెప్పుకుంటూ మత విద్వేషాలు.. కుల చిచ్చులు రేపుతూ ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోయింది అయితే తాజాగా చండీగఢ్ లో జరిగిన ఒక సంఘటన ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ దారునాలకి పరాకాష్టగా నిలిచింది..

వాట్సప్ గ్రూప్ లు పెట్టుకని వాటిలో జరిగే సంభాషణ వలన ఒకరిని నొచ్చుకుని మహా అయితే గ్రూప్ నుంచీ బయటకి వచ్చేస్తారు కానీ ఎక్కడా లేని విధంగా గ్రూప్ లో వచ్చిన చిన్న గొడవ కారణంగా ఏకంగా గ్రూప్ లో ఉన్న సభ్యుడినే హత్య చేసేశారు..చాలా లేటుగా వెలుగు చూసిన ఈ దారుణం హర్యానాలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళ్తే..