పొట్ట చుట్టూ కొవ్వు కరిగించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు    2018-06-02   00:50:49  IST  Lakshmi P

పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలో మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా గుండె జబ్బులు,మధుమేహం వంటి వ్యాధులు వస్తాయి. అందువల్ల పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటమే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకుంటే ఖచ్చితంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

కరివేపాకు
ప్రతి రోజు పరగడుపున ఐదు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఆకులను తినలేని వారు కరివేపాకు పేస్ట్ ని మజ్జిగలో కలుపుకొని త్రాగవచ్చు. ఆలా కూడా త్రాగలేని వారు కరివేపాకును ఎండబెట్టి పొడి చేసుకొని అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఏ విధంగా తిన్నా ప్రతి రోజు మాత్రం క్రమం తప్పకుండా తినాలి.