పైసా వ‌సూల్‌ రివ్యూ

న‌టీన‌టులు: న‌ంద‌మూరి బాల‌కృష్ణ‌, శ్రియా శ‌ర‌ణ్‌, మ‌స్కాన్ సేథీ, కైరాద‌త్‌
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.ముఖేష్‌
ఎడిటింగ్‌: జునైద్ సిద్ధిఖి
నిర్మాత‌: వి.ఆనంద‌ప్ర‌సాద్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరీ జ‌గ‌న్నాథ్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 142 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 01 సెప్టెంబ‌ర్‌, 2017

బాల‌య్య – పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పైసా వ‌సూల్ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాల‌య్య చివ‌రి సినిమా శాత‌క‌ర్ణి సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డం, ఇటు పూరి నాలుగు వ‌రుస ప్లాపుల‌తో ఉండ‌డంతో ఈ సినిమాను పూరి ఎలా తెర‌కెక్కిస్తాడా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంది. పూరి సినిమాలో డైలాగులు, హీరో క్యారక్టరైజేషన్ ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోను ఉంటుంది. తేడా సింగ్ అంటూ టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తోనే సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాలు అందుకుందా ? లేదా ? అన్న‌ది తెలుగుస్టాప్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:


కథగా చెప్పాలంటే పైసా వ‌సూల్ గొప్ప క‌థ కాదు. పూరి మార్క్ మాఫియాడా, డ్ర‌గ్స్ లింకుల‌తో ఉన్న క‌థే. బాబ్‌మార్లే అనే ఇంట‌ర్నేష‌న‌ల్ డాన్‌ను ప‌ట్టుకునేందుకు ఇంటిలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఓ ఖ‌ర‌త్నాక్ వ్య‌క్తి కోసం వెయిట్ చేస్తోన్న టైంలో ఏసీబీ కిర‌ణ్మ‌యి (కైరాద‌త్‌)ను బాల‌య్యను ప‌ట్టుకుని బాబ్‌మార్లేను చంపే మిష‌న్ అప్ప‌చెపుతుంది. తేడా సింగ్ హారిక (మ‌స్కాన్‌)ను ఓ గ్యాంగ్ నుంచి కాపాడ‌తాడు. అయితే హారిక మాత్రం త‌న‌ను కాపాడేందుకు వ‌చ్చిన తేడాసింగ్‌ను కాల్చేస్తుంది. ఇదిలా ఉంటే పోర్చుగ‌ల్‌లో ఉండే బాలు (బాల‌కృష్ణ‌) కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ అక్క‌డ ఓ గ్యాంగ్ ఎటాక్‌లో సారిక (శ్రియా)ను కాపాడ‌తాడు. త‌ర్వాత ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇండియాలో ఉండే తేడాసింగ్‌కు, పోర్చుగ‌ల్‌లో ఉండే బాలుకు లింక్ ఏంటి ? అస‌లు బాబ్ మార్లేను ఎవ‌రు ? బాబ్ మార్లేకు ఇండియాకు ఉన్న స‌బంధం ఏంటి ? బాబ్‌మార్లేను టార్గెట్ చేసిన బాలు ఏం కోల్పోయాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.