పూజల సమయంలో రాగి పాత్రలను ఎందుకు వాడతారో తెలుసా ?    2018-06-02   01:02:06  IST  Raghu V

మనం పూజలు చేసే సమయంలో ఎక్కువగా రాగి పాత్రలను వాడుతూ ఉంటాం. దీనికి సంబంధించి వివరాలను వరాహ పురాణంలో వరాహ స్వామి భూదేవికి వివరించారు. కొన్ని యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువును పూజించేవాడు. గుడాకేశుడు అనే రాక్షసుడు రాగి రూపంలో విష్ణువు కోసం తపస్సు చేసాడు. ఆ రాక్షసుని తపస్సుకి మెచ్చి విష్ణువు ప్రత్యక్షం అయ్యి ఏ వరం కావాలో కోరుకోమని చెప్పగా…. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు.