పురంధరేశ్వరి భారీ స్కెచ్ తో.. టిడిపి మైండ్ బ్లాక్

పురంధరేశ్వరి పేరు రాష్ట్రరాజకీయాల్లో తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. నందమూరి ఎన్టీఆర్ గారి ముద్దుల కూతురు.ఎంతో తెలివైన వ్యక్తీ..రాజకీయాల్లో తండ్రిబాటలో నడిచి సక్సెస్ అయ్యారు..కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.అయితే రాష్ట్ర విభజన తరువాత ఆమె చాల ఘోరంగా ఓడిపోయారు. సీన్ అంతా రివర్స్ అయ్యింది.ఈ నేపధ్యంలోనే ఆమె మళ్ళీ పునర్వైభవం కోసం తహతహ లాడుతున్నారు.అందుకోసమే ఆమె భారీ స్కెచ్ వేశారు.

2019 ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని ఆమె గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. అందుకే ఆమె మాట్లాడుతున్న తీరు కానీ..వేగంగా వేస్తున్న అడుగులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గ‌తంలో కాంగ్రెస్‌లో చేరి కీల‌క రోల్ పోషించిన పురందేశ్వ‌రి.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ నుంచీ బీజేపీలోకి జంప్ చేశారు. 2014 లో రాజంపేట నుంచి ఎంపీగా బిజెపి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆమెకి ఎక్కడి నుంచీ పోటీ చేయాలి అనే విషయంలో తీవ్రమైన సంగిగ్దంలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు తనదైన శైలిలో ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఆమె గతంలో రాజంపేట నుంచీ పోటీ చేసి ఆమె ఓడిపోయారు అన్న విషయం తెలిసిందే ..ఇక ఇప్పుడు అక్కడ నుంచీ పోటీ చేసినా ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడు ఆమెని గెలిపించే నియోజకవర్గం ఎక్కడ ఉందా అనే వెతుకులాట ప్రారభించారట. అయితే ఇప్పుడు ఆమె కన్ను తన తండ్రి ఇలాఖ అయిన హిందూపురం పై పడింది. హిందూపురం అయితే త‌న‌కు వ్య‌క్తిగ‌త గుర్తింపు క‌న్నా అన్న‌గారి కుమార్తెగా ఉన్న గుర్తింపు స‌రిపోతుంద‌ని ఆమె భావిస్తోందని సమాచారం. ప్లాన్ అయితే బాగుంది కానీ ఇప్పుడు అక్కడ సీటు కావాలంటే ఢిల్లీ పెద్దల అనుమతి ఉండాలి. ఎన్టీఆర్ కుమార్తెగా నేను అక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు అక్కడి నుంచీ టికెట్ ఇవ్వండి అని పెద్దలకి చెప్తూ వేగంగా పావులు కదుపుతున్నారు. అసలు ఈ టికెట్ టిడిపి వాళ్ళది..పొత్తులో భాగంగా తనకి వచ్చేలా భారీ ప్లాన్ వేసి బిజేపి పెద్దల ద్వారా స్వయంగా చంద్రబాబే అక్కడి టికెట్ పురధరేస్వరికి ఇచ్చేలా ఆమె వేస్తున్న స్కెచ్ మాములుగా లేదని చెప్తున్నారు విశ్లేషకులు. ఎంతన్నా అన్నగారి కూతురుగా మరి అనుకుంటున్నారు బిజేపి నేతలు.మరి పురంధరేశ్వరి స్కెచ్ ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరి.