పాపం “స్పైడర్” కి ఎన్ని కష్టాలో

మురుగదాస్ –మహేష్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్ . మురుగదాస్ ఏ చిత్రాన్ని తీసినా దాన్ని తప్పకుండాతెలుగు,హిందీ ,తమిళ్ లో సక్సెస్ అయ్యేలా ముందే ప్లాన్ చేసుకుని ప్రాజెక్ట్ చేపడుతాడు. హిందీలో కూడా మురుగదాస్ ఒక సినిమా తీశాడు సో ఆ పరిచయాలతో స్పైడర్ ని కూడా హిందిలో దింపి అక్కడ మార్కెట్ చేయాలని అనుకున్నాడు. అందుకే స్పైడర్ షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. “స్పైడర్” టైటిల్ బాలీవుడ్ ప్రేక్షకులకి బాగా రీచ్ అవుతుందని అనుకున్నాడు కానీ తన అంచనాలు సక్సెస్ అవ్వలేదు స్పైడర్ కి అక్కడ క్రేజ్ రాలేదు.

‘స్పైడర్’ టైటిల్ లాంటి టైటిల్ ని బాలీవుడ్ జనాలు తొందరగా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నాడు మురుగదాస్ కాని తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ద్వారా స్పైడర్ ని బాలివుడ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నాడు కానీ ఆ ప్లాన్ కూడా సక్సెస్ అవ్వలేదు.మహేష్ తన భార్య సమ్రత కి బాలీవుడ్ లో ఉన్న పరిచయాలతో స్పైడర్ కి క్రేజ్ తీసుకురావాలి అని అనుకుంటే ఆ ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి.

హిందీలో స్పైడర్ ని అనువదించి అక్కడి వాళ్ళు పట్టించుకోక పొతే స్పైడర్ కి బ్యాడ్ టాక్ వస్తుంది అని భావించిన చిత్ర యూనిట్ హిందీ లో రిలీజ్ ఆపేస్తేనే బెటర్ అని ఫిక్స్ అయ్యాయి.అందుకే సెప్టెంబర్‌ 27న హిందీలో ‘స్పైడర్‌ ‘విడుదల ఆపేసినట్లుగా వార్తలొస్తున్నాయి.ఒక వేల ఇక్కడ స్పైడర్ బంపర్ హిట్ అయితే అప్పుడు హిందీలో కి అనువదిస్తే బాగుంటుంది అని అనుకున్నారట.ఏది ఏమైనా స్పైడర్ కి బాలీవుడ్ లో ఎదురు దెబ్బలు గట్టిగానే తగిలాయి అని అనుకుంటున్నారు సినీ జనం .