పాపం .. ఈ హీరోతో ముద్దు అంటే హీరోయిన్లు వద్దు అంటున్నారు

ఒక సినిమా ఒప్పుకున్నామంటే అందులో సహనటులు నచ్చినా, నచ్చకపోయినా నటించాల్సిందే. అయితే అడ్జస్ట్ అయినా అవ్వాలి, లేదంటే సినిమా నుంచి తప్పుకోవాలి. కొన్నిసార్లు రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు హీరోతో సీన్ చేయడం హీరోయిన్ కి ఇష్టం లేకపోయినా, హీరోయిన్ తో సీన్ చేయడం హీరోకి ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ముద్దు సన్నివేశం చేసేటప్పుడు ఆ హీరోయిన్ ఎదో తిని వచ్చిందని, ఆ హీరో నోటి దుర్వాసన తట్టుకోలేకపోయానని .. ఇలా హీరోహీరోయిన్లు కంప్లయింట్స్ చేయడం కూడా చూసాం మనం. ఒక్కోసారి హైజీన్ సమస్యలు ఉంటే, కొన్నిసార్లు సహనటి లేదా సహనటుడితో అలాంటి సన్నివేశం చేయడమే ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు బాలివుడ్ నటుడు నవాజోద్దిన్ సిద్దిఖి.

పాపం తనతో ముద్దు సన్నివేశాలు చేయడం హీరోయిన్లకి ఇష్టం లేదని తన బాధ చెప్పుకుంటున్నాడు నవాజ్. తన కొత్త చిత్రం ‘బాబుమొశాయ్ బందూక్ బాజ్’ లో గాఢమైన చుంబన దృశ్యాలు ఉన్నాయి.