పాదాల మంట తగ్గటానికి ఇంటి చిట్కాలు

2. ఆవాల నూనె మరియు ఉప్పు

పాదాల మంటను తగ్గించటానికి మరొక సమర్ధవంతమైన ఇంటి నివారణగా ఆవాల నూనె మరియు ఉప్పు అని చెప్పవచ్చు. ఒక కంటైనర్ లో ఆవాల నూనె మరియు ఉప్పు వేసి బాగా కలిపి పాదాలకు రాసి మసాజ్ చేయాలి. ఉప్పు ఘర్షణ మరియు ఆవాల నూనె మర్దన పాదాల యొక్క నరాలను ఉత్తేజితం చేస్తాయి. ప్రతి రోజు ఈ మసాజ్ ని 15 నిమిషాల పాటు చేసి, ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేయాలి. మంచి పలితాన్ని పొందటానికి పాదాలను శుభ్రం చేసుకున్న వెంటనే కాటన్ సాక్స్ వేసుకోవాలి.

3. వేడి పసుపు పేస్ట్

వేడి పసుపు పేస్ట్ పాదాల మంటను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో పసుపు వేసి పేస్ట్ చేయటానికి నీటిని కలపాలి. ఈ పేస్ట్ ని పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు వేడి చేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు ఒక మందపాటి పొరగా వేసి ఆరేవరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసే ముందు భరించగలిగే వేడి ఉండేలా చూసుకోవాలి. ఈ పేస్ట్ ని పాదాలకు క్రమం తప్పకుండా రాస్తే పాదాలకు రక్త ప్రసరణ పెంచటం మరియు పాదాల మంట తగ్గటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.

4. అల్లం మరియు పొద్దుతిరుగుడు నూనె

అల్లం శరీరంలో రక్త ప్రసరణ పెంచటానికి అద్భుతమైన ఉత్పత్తి అని చెప్పవచ్చు. అల్లం రసంలో పొద్దుతిరుగుడు నూనెను కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియలో పాదాలకు వేడి పుట్టించి రక్త ప్రసరణ పెరిగేలా అల్లం సహాయపడుతుంది. రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి మరింత ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. అందువలన పాదాల మంటకు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.