పసుపు పొడిలో ఉన్న ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు  

పసుపును చికిత్సలోనే కాకుండా అందం ఉత్పత్తులు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు..

భారతదేశంలో పసుపును దాదాపుగా అన్ని రకాల గ్రేవీ వంటలలోను ఉపయోగిస్తారు. ఇది ఆహారానికి మంచి రంగు మరియు మంచి రుచిని ఇస్తుంది.

పసుపు ఒక ప్రసిద్ధ సంరక్షణకారిని అని చెప్పవచ్చు. గుజరాత్ శాస్త్రవేత్తలు పనీర్ (కాటేజ్ చీజ్) కి పసుపును జోడించడం ద్వారా పనీర్ 12 రోజులు నిల్వ ఉండటాన్ని కనుగొన్నారు.

పసుపును ఒక గొప్ప క్రిమిసంహారిణి అని చెప్పవచ్చు. ఇంటి చుట్టూ పసుపు పొడిని చల్లితే కీటకాలు, చీమలు, చెదపురుగుల బాధ ఉండదు.

భారతదేశంలో మహిళలు క్రీమ్స్ మరియు స్క్రబ్స్ వంటి చర్మ ఉత్పత్తులలో పసుపును ఉపయోగిస్తారు.

భారతదేశ వివాహాలలో పసుపుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. వివాహానికి ముందు పసుపు ఉత్సవంలో భాగంగా వధువు మరియు వరుడుకి పసుపు పేస్ట్ ని రాస్తారు. ఈ విధంగా రాయటం వలన చర్మం ప్రకాశవంతంగా మారుతుందని మరియు చెడు దృష్టి ఉండదని నమ్మకం.

పసుపును స్వచ్ఛత, శ్రేయస్సు మరియు సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు.