పశ్చిమలో జగన్ పక్కా ప్లాన్..సర్వం సిద్దం     2018-06-03   00:55:43  IST  Bhanu C

జగన్ మోహన్ రెడ్డి కి గత ఎన్నికల్లో ఒకరకంగా అధికారాన్ని దూరం వాటిలో ఒక కారణం పశ్చిమగోదావరి జిల్లానే అని చెప్పాలి ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక్క సీటు అంటే ఒక్క సీటు కూడా పశ్చిమ నుంచీ రాకపోవడంతో వైసీపి సీఎం ఫీటాన్ని సాధించలేక పోయింది..అయితే ఈ సారి ఎట్టి పరిస్థిత్తులలో అయినా సరే పశ్చిమలో చక్రం తిప్పాలని పక్క వ్యుహాలని సిద్దం చేసుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి ఆదిశగా చేక చేకా అడుగులు వేస్తూ దూసుకు వెళ్తున్నాడు.. వివరాలలోకి వెళ్తే..

ప్రజా సంకల్పయాత్ర పేరుతో జగన్‌ చేస్తున్న పాదయాత్ర ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో పూర్తయి ప్రస్తుతానికి పశ్చిమలో నడుస్తోంది..ఈ యాత్రకి ఆయా వర్గాల నుంచి భారీ స్పందన వస్తోంది..ఈ యాత్రపై ప్రజల నుంచీ మొదలు రాజకీయ సమీకరణాలలో సైతం వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి..అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు కూడా రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు.