పవన్ పరువు తీసిన కిడ్నీ డాక్టర్ ! అసలు నిజాలు ఇవేనా ..? .     2018-05-26   03:22:13  IST  Bhanu C

ఉద్దానం కిడ్నీ సమస్యల మీద పవన్ పప్పులో కాలు వేశాడా..? అసలు దానిమీద కనీస అవగాహన లేకుండా పవన్ ఆ ఇష్యు ఎత్తుకుని రాజకీయ లబ్ధిపొందాలి అనుకుంటున్నాడా..? కిడ్నీ బాధితులను పవన్ మోసం చేస్తున్నాడా ..? అంటే మోసం చేస్తున్నాడనే చెప్పాలి. పవన్ ఈ విషయంలో ఉన్న సీరియస్ నెస్ తెలియకుండా ,కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిడ్నీ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ విజయకుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా లో రాసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

నేను ఒక కిడ్నీ వ్యాధి నిపుణుడిని నాకు ఈ రంగంలో 23 యేళ్ల అనుభవం ఉంది. కానీ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే నన్ను గెలిపించితే లేదా నా దగ్గర ఐదుగురు లేదా ఆరుగురు ఎమ్మెలేలు ఉంటే నేను ఈ సమస్యని వెంటనే పవర్ లోకి రాగానే పరిష్కరిస్తాను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం.

ఈ క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి! ప్రపంచం మొత్తం ప్రతీ సంవత్సరం 35 మిలియన్ మందిని చంపుతున్న జబ్బు, ఇది ఒక్క ఉద్దానం లోనే కాదు ఇంకా చాల చోట్ల ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ! ఈ ఉద్దానం కిడ్నీ జబ్బు అనేది ఒక’ కారణం తెలియని జబ్బుగా’ తేల్చి చెప్పింది,అది కూడా ఊరికే కాదు! ఎన్నో పరిశోధనలు ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఐసీఎమార్, బాబా రీసర్చ్ సెంటర్, హార్వార్డ్ విశ్వవిద్యాలయం లాంటివి పరిశోధనలు చేసిన తరువాత ఏ విషయాన్నీ ధ్రువీకరించారు.