పవన్ “నోటి దూల” తీర్చేస్తున్న యూత్..     2018-06-08   01:49:20  IST  Bhanu C

పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు..ఆ ఆవేశంలో నోటికి ఎదోస్తే అది మాట్లాడేస్తాడు ఆ ఆవేశం ఎన్నో సార్లు ఎన్నో అనర్దాలకి దారి తీసింది అయితే తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పై , కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పొలిటికల్ హీటు పెచుకుంటూ పోతున్నాడు అయితే ఈ క్రమంలోనే మాడుగల నియోజకవర్గం చీడికాడ మండలంలో పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటల యువకులలో తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి..వివరాలలోకి వెళ్తే..

అసలు పవన్ కళ్యాణ్ తో పొత్తు కావాలని రాజకీయ పార్టీలు కొరుకొవడానికి ప్రధానమైన కారణం ఒక్కటే అతడి వెనుక యువత అధిక సంఖ్యలో ఉంటారని మరియు కాపుల ఓటు బ్యాంక్ పడుతుందని..చంద్రబాబు జట్టు కట్టినా లేక జగన్ జట్టు కట్టాలని అనుకున్నా సరే కేవలం యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూసుకునే అయితే ఇప్పుడు తన దుందుడుకు చర్యలవలన యూత్ ఓట్లు మొత్త దూరం అయ్యేలా ఉన్నాయి..