పవన్ కళ్యాణ్ పై “ముద్రగడ” షాకింగ్ కామెంట్స్..    2018-04-15   06:45:24  IST 

గతకొంత కాలంగా చాలా సైలెంట్ గా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్ళీ ఈ మధ్య వార్తలలో నిలిచారు..తన కొడుకుకి ఎమ్మెల్యే సీటు కోసం వైసీపి అధినేత జగన్ తో కలిసి మంతనాలు చేస్తున్నారు , ముద్రగడ ఉద్యమం తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు కోసమే అంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించని ముద్రగడ తాజాగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..పవన్ రెండు పడవల సిద్దాంతం పాటిస్తే ఘోరంగా దెబ్బ తింటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..అయితే ఈ వ్యాఖ్యలు ముద్రగడ ఎందుకు చేశారు అసలేం జరిగిందంటే..

ఈరోజు మీడియాతో మాట్లాడిన ముద్రగడ జనసేన పార్టీలో నేను చేరుతాను అంటూ వస్తున్నా వార్తల్లో నిజం లేదని తెలిపారు..


పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో నెగ్గాలి అంటే ముందు రెండు పడవల మీద కాళ్ళు పెట్టకుండా ఉండాలని హితపు పలికారు..ఎన్టీఆర్ మాత్రమే ఏపీ చరిత్రలో సినిమాల నుంచీ వచ్చి సక్సెస్ అయ్యారని మిగతా వారికి ఎవరికీ కూడా ఇప్పుడు ఆ అవకాశం లేదని అన్నారు..అయితే ఎన్టీఆర్ లా పవన్ నెగ్గాలంటే మాత్రం ప్రజలలో తిరిగి పట్టు సంపాదించాలని అన్నారు.. ముద్రగడ