పరాయి స్త్రీ పై వ్యామోహం ఎంత నీచమో తెలుసా? ఇది తప్పక చదవండి..     2018-06-01   10:32:06  IST  Raghu V

ఇంట్లో సౌందర్యం ఒలకబోసే కుందనాల బొమ్మలాంటి భార్య ఉన్నప్పటికీ చాలా మంది పురుషులు ఇతర మహిళలపై కన్నేస్తుంటారు. ఇది మానసికమైందా, లేదంటే మరేమైనా కారణాలున్నాయా అనేది ఆసక్తికరమైన విషయమే. పరాయి స్త్రీ పై వ్యామోహం… మనిషి పతనానికి కారణం …. ఘోరపాపం..మీకు అలంటి ఆలోచనలు ఉంటే ఈ కథ లో నీతి చూడండి …ఒకటికి పది సార్లు ఆలోచించండి..

ఒకసారి ఒక రాజుగారు గుఱ్ఱం పై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు…..

ఆ ఇంటిలో ఒకావిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంది, ఆమె చాలా అందగత్తె, ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇదివరకు చూడనేలేదే అని అనుకున్నాడు………

ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటికి వెళ్ళిపోయాడు.భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది…

అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి వాకిలి కొట్టాడు. ఆవిడ వచ్చి వాకిలి తీసింది…

రాజుగారు లోపలికి వెళ్ళి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ నేను ఈ రాజ్యానికి రాజును ,నీవు చాలా అందంగా ఉన్నావు అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను,నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్ళి చేసుకొని నా రాజ్యానికి రాణి ని చేస్తాను అని చెప్పాడు…..