పబ్ లో పోర్న్ స్టార్ ని కొట్టిన దిగ్గజ క్రికెటర్     2017-09-24   04:49:14  IST  Raghu V

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఆటగాడు షేన్ వార్న్ ఎవరో ఇక్కడ అందరికి తెలుసు కదా. ఎందుకు తెలియదు లెండి, సచిన్ – గంగూలి తరంలో క్రికెట్ చూసిన వారైనా, ఇప్పుడిప్పుడే క్రికెట్ చూస్తున్న వారైనా, షేన్ వార్న్ ఎవరో తెలియకుండా ఉండటం కష్టం. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్స్ కలిపి 1000 వికెట్లు తీసుకున్నది ఇద్దరంటే ఇద్దరే బౌలర్లు. ఆ ఇద్దరిలో ఒకడు షేన్ వార్న్. మరో బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా. షేన్ వార్న్ ఐపియల్ ప్రియులకి కూడా సుపరిచితుడు. ఐపియల్ మొదటి సీజన్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కి అప్పుడు సారథిగా వ్యవహరించింది ఈ లెగ్ స్పిన్ దిగ్గజమే కదా. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అంటే, షేన్ వార్న్ తన అలవాటు ప్రకారం మరో వివాదంలో ఇరుకున్నాడు. ఈసారి ఓ పోర్న్ స్టార్ మీద చేయి చేసుకున్నాడు.

లండన్ లోని ఓ ఫేమస్ పబ్ లో 30 ఏళ్ల పోర్న్ స్టార్ వేలేరి ఫాక్స్ (Valerie Fox) మీద చేయి చేసుకున్నాడు షేన్ వార్న్. ఆ దృశ్యం సిసి టివి కెమెరాలో రికార్డ్ అయ్యింది. వార్న్ కొట్టిన దెబ్బ ఫాక్స్ కంటికి బలంగా తగిలినట్టుగా ఉంది. ఆమె తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని బయటపెడుతూ, కంటిని దాచుకున్న ఫోటోని పోస్ట్ చేసింది. ఆ తరువాత వెళ్లి పోలీసులకి ఫిర్యాదు చేసింది. మీడియాతో మాట్లాడినా ఫాక్స్, అతను మనిషా, జంతువా? ఒక మహిళపై చేయి చేసుకోవడం ఏమిటి. తను ఫేమస్ కావచ్చు, అయితే మాత్రం ఇలా ప్రవర్తించి, చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే భ్రమలో ఉన్నాడేమో అంటూ ఘాటుగానే స్పందించింది.