నీ అన్నకి నువ్వేమి తీసిపోవు..పవన్ పై కావు నాడు ఫైర్    2018-03-21   04:41:01  IST  Bhanu C

ఏపీలో పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలతో కాపు బిడ్డలు తలలు దించుకుంటున్నారు..పవన్ కళ్యాణ్ నీ వేషాలు ఇంకా కట్టిపెట్టు..నీ అన్న కాపులని మోసం చేసినట్టే నువ్వు కూడా చేస్తావని అర్థం అవుతోంది అంటూ ఏపీ కాపునాడు తీవ్రంగా ధ్వజమెత్తింది..పవన్ కళ్యాణ్ ఏపీ కి అన్యాయం చేస్తున్నావ్ ఢిల్లీ కి అమ్ముడు పోయావ్ అంటూ ఫైర్ అవుతునారు కాపు నాడు నేతలు..మాకు కులం ముఖ్యం కాదని, రాష్ట్రం ముఖ్యమని..పవన్ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి చంద్రబాబు కి బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు..

ఒక పక్క చంద్రబాబు నాయుడు కేంద్రం తో డీ అంటే డీ అంటూ ఫైట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ ప్రయోజనాలు మోడీ వద్ద తాకట్టు పెడుతున్నారని అన్నారు..చంద్రబాబు ఒక్కరే ధైర్యంగా కేంద్రంపై పోరు తలపెట్టారని అన్నారు..పవన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.. చంద్రబాబు పోరాటాన్ని కాపులు అందరూ సహకరిస్తాం అని, అలా కాదని చంద్రబాబుని మన వాళ్ళే బలహీన పరిస్తే ఎలా అంటూ, పవన్ కళ్యాణ్ ను నిలదీశారు..పవన్ కళ్యాణ్ ఏపీలో బీజేపి ఒక వక్తాలా ఉన్నారని మోడీపై ఈగ కూడా వాలనివ్వడం లేదంటూ మండి పడ్డారు..

అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతూ వస్తున్న కాపు సంఘం నేతలు పనిలో పనిగా చిరంజీవిని కూడా మధ్యలోకి లాగారు..ఇప్పటికే ఏపీ కాపు ప్రజలు ఒకసారి చిరంజీవి రూపంలో అవమానాలు పొందామని..ఇప్పుడు మళ్ళీ చిరంజీవి బాటలోనే పవన్ వెళ్తున్నాడని మళ్ళీ మళ్ళీ మీ అన్నదమ్ముల వలన ఏపీలో మన సమాజిక వర్గం పరువు పోయేలా ఉందని అన్నారు ఢిల్లీ పై చంద్రబాబు పోరాడుతుంటే సహకరించాల్సింది పోయి ప్రతి ఒక్కరు ఆయన వైపు నిలుస్తున్నారు… ఇప్పటికైనా జగన్, పవన్, లాలూచి పనులు మాని, రాష్ట్రం కోసం పోరాడాలి..పవన్ జగన్ లు చంద్రబాబు ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు..