నిర్మాతలను హఢలెత్తిస్తున్న దర్శకుడు     2018-06-06   01:25:04  IST  Raghu V

స్టార్‌ దర్శకులు, క్రేజ్‌ ఉన్న దర్శకులు ఎంత బడ్జెట్‌ పెట్టినా కూడా రికవరీ అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. కాని కొందరు చిన్న దర్శకు కూడా తమ స్థాయిని మించి నిర్మాతలతో ఖర్చు చేయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ సినిమా సక్సెస్‌ అయినా కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే దర్శకుడు, హీరోల స్థాయిని బట్టి సినిమాలను నిర్మించాలి అంటూ సీనియర్‌ నిర్మాతలు ఈ తరం నిర్మాతలకు సలహాలు ఇస్తూ ఉంటారు. కొందరు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మాణంలోకి దిగి నష్టపోయి నెత్తిన గుడ్డ వేసుకుంటారు. ఒక సినిమాను తీస్తున్నాం అంటే ఆ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా సగం కంటే ఎక్కువ రికవరీ అయ్యేలా ప్లాన్‌ చేసుకోవాలి.

అలా జరగాలి అంటే కేవలం తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. తెలుగులో ఈమద్య కాలంలో సినిమాల నిర్మాణ వ్యయం చాలా పెరిగింది. రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం తీసిన తర్వాత సినిమాలో కంటెంట్‌ ఉంటే ఎంత బడ్జెట్‌ అయినా రికవరీ అవుతుందనే నమ్మకంతో సినిమాలు తీసేస్తున్నారు. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తాజాగా రాజశేఖర్‌తో ‘గరుడవేగ’ చిత్రంను ఏకంగా 40 కోట్లు పెట్టి నిర్మించాడు. రాజశేఖర్‌కు, ప్రవీణ్‌ సత్తార్‌కు అంత బడ్జెట్‌ చాలా అంటే చాలా ఎక్కువ. అయినా కూడా నిర్మాతలు ఆ మొత్తంను ఖర్చు పెట్టారు.