నా పేరు సూర్యలో ఇదే పెద్ద మైనస్‌ : ఒక మెగా అభిమాని     2018-05-04   23:10:40  IST  Raghu V

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్‌ మరియు నాగబాబులు సంయుక్తంగా నిర్మించిన ‘నా పేరు సూర్య’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంకు మిశ్రమ స్పందన వస్తుంది. మెగా ఫ్యాన్స్‌కు ఇది మరో బ్లాక్‌ బస్టర్‌ను తెచ్చి పెడుతుందని, మెగా ఫ్యాన్స్‌ తల ఎత్తుకునేలా ఈ చిత్రం ఉంటుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా ఈ చిత్రం ఫలితం తారు మారు అయ్యింది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది.

ఈ చిత్రంపై ఒక మెగా అభిమాని తన సోషల్‌ మీడియా పేజీలో ఇలా రాసుకున్నాడు… రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా అనగానే చాలా అంచనాు పెంచుకున్నాను. తప్పకుండా ఇది భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం కలిగింది. సినిమా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ విడుదలైన వెంటనే అబ్బ బన్నీకి బ్లాక్‌ బస్టర్‌ ఖాయం అని అందరితో పాటు నేను కూడా అనుకున్నాను. కాని సినిమా విడుదల తర్వాత ఫలితం చూసి షాక్‌ అయ్యాను. ట్రైలర్‌ మరియు టీజర్‌లో చూపించింది ఒకటి, సినిమాలో చూపించింది మరోటిలా ఉంది.