నాలుగు రోజుల ముందే ఎన్టీఆర్ కి చెక్ పెట్టిన మహేష్     2017-09-24   00:07:35  IST  Raghu V

ఓవర్సీస్ లో బాబు బ్యాటింగ్ మొదలైంది. తనని ఓవర్సీస్ కింగ్ అని ఎందుకు అంటారో మహేష్ బాబు మరోసారి నిరూపించుకుంటున్నాడు. స్పైడర్ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. నాలుగు రోజుల ముందే రికార్డుల వేట లాంఛనంగా మొదలుపెట్టాడు సూపర్ స్టార్.

మామూలుగానైతే పెద్ద హీరోల సినిమాలు యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $500k కి పైగా వసూలు చేస్తాయి. జైలవకుశ ప్రీమియర్స్ ద్వారా $589k వసూలు చేసింది. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో హయ్యెస్ట్ కాగా, ఓవరాల్ గా (బాహుబలి సీరీస్ కలిపు) 5th హయ్యెస్ట్. స్పైడర్ 3-4 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా $500k మార్కుని దాటేయడం ట్రెడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. బాహుబలి తరువాత ఓ భారతీయ సినిమాకి అమెరికాలో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఇదే తొలిసారి. స్పైడర్ కేవలం ప్రీమియర్స్ ద్వారానే మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఇక లాంఛనప్రాయమే.

మరి ప్రీమియర్ కలెక్షన్లు ఖైదీ నం 150 స్థాపించిన నాన్ బాహుబలి రికార్డు ($1.295) ని స్పైడర్ దాటుతుందా లేదా అనేదే మిగిలిన ప్రశ్న. అయితే ఖైదీ నం.150 ప్రీమియర్స్ కథాకామీషు వేరు. TMobile డిస్కౌంట్ ఆఫర్ ద్వారా, $25 పెడితే, అందులో $23 క్యాష్ బ్యాక్ పొందారు ప్రేక్షకులు. జై లవ కుశ, స్పైడర్ చిత్రాలకు Buy 1 get 1 free ఆఫర్స్ కొంత సహాయం చేసాయి. స్పైడర్ కి ఇప్పుడు ఆ ఆఫర్ కూడా అందుబాటులో లేదు. కాబట్టి, స్పైడర్ ప్రీమియర్స్ పూర్తిగా లేదా చాలావరకు మహేష్ బాబు బ్రాండ్ పవరే లాగుతోంది అనడంలో ఎటువంటి సందేహం అక్కరలేదు. చూదాం మరి, ప్రిన్స్ ఎన్ని రికార్డులు సెట్ చేస్తాడో.