‘నానువ్వే’పై వారికే నమ్మకం లేదా?     2018-05-22   01:45:43  IST  Raghu V

వరుస ఫ్లాప్‌ల తర్వాత నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నా నువ్వే’. ఈ చిత్రానికి జయేంద్ర దర్శకత్వం వహించగా తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి ముందు కళ్యాణ్‌ రామ్‌ ‘ఎమ్మెల్యే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా కాజల్‌ హీరోయిన్‌గా నటించింది. ‘ఎమ్మెల్యే’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా ప్రచారం చేశారు. అయితే అంచనాలను ఆ చిత్రం అందుకోవడంలో విఫలం అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనంతో ఎమ్మెల్యే సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఇప్పుడు కళ్యాణ్‌ రామ్‌ ‘నానువ్వే’ చిత్రంపై అందరి దృష్టి ఉంది.

‘నానువ్వే’ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. కారణం కళ్యాణ్‌ రామ్‌ చేసిన ఏ సినిమా కూడా ఈమద్య సక్సెస్‌ను దక్కించుకోలేక పోతుంది. అందుకే ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం లేదు. అయితే ఈ చిత్రంలో తమన్నా ఉండటం వల్ల ఏమైనా కొత్తగా ఉంటుందా అని మాత్రం ఆలోచిస్తున్నారు. సినిమా మొత్తం పూర్తి అయ్యి, విడుదలకు సిద్దం అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రాన్ని ఈవారంలోనే అంటే ఈనెల 25న విడుదల చేయాల్సి ఉంది. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.