“నాటా” సాహిత్య పోటీలకి “ఎన్నారై” లకి ఆహ్వానం    2018-04-23   02:35:33  IST 

ఉత్తర అమెరికా తెలుగు సమితి (“నాటా”) ప్రతీ ఏటా తెలుగు సంస్కృతీ ,సాంప్రదాయాలు మరియు కవితలు ఇలా ఎదో ఒక విధంగా తెలుగుదనాన్ని చాటి చెప్పే కార్యక్రమాన్ని ఎదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తూనే ఉంటుంది..అయితే అందులో భాగంగానే ఈ సారి నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు, కవులకు ఆహ్వానం పలికింది..అయితే నాటా ఈ సారి సారంగా వెబ్ అనే సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు..

అయితే వీటిలో గెలుపొందిన విజేతలని జూలై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు. ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి రూ. 15 వేలు, రెండో బహుమతికి రూ. 10 వేలు, మూడో బహుమతికి రూ. 5 వేలు ఇవ్వనున్నారు…అయితే గతంలో కూడా ఎటువంటి పోటీలకి తెలుగు వారి నుంచీ విశేష స్పందన లభించింది..

అయితే “కవితల” పోటీల్లో మొదటి బహుమతికి రూ. 5 వేలు, రెండో బహుమతికి రూ. 3 వేలు, మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు.జూన్‌ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది. పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks.com)లో ప్రచురిస్తారు. అదేవిధంగా రచనలు Literaty@nata2018.org పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్‌ జయదేవ్‌ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు.