నాగ్‌, వెంకీలు సరైన నిర్ణయం     2018-06-25   05:33:42  IST  Raghu V

వయస్సు మీద పడుతున్నా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా పని చేస్తే అనర్థాలు జరుగుతాయి. ఏ పని అయిన, ఏ విషయం అయినా కూడా వయస్సును బట్టి మసుకోవడం మంచిదని అంతా అంటూ ఉంటారు. ఆరు పదుల వయస్సులో కూడా ప్రేమ కథల్లో నటిస్తాను, ఎగిరి దుంకుతాను అంటే ప్రేక్షకులు అంగీకరించరు. వయస్సుకు తగ్గట్లుగా సినిమాల్లో కూడా కనిపిస్తేనే ప్రేక్షకులు ఆధరిస్తారు అనే విషయాన్ని సీనియర్‌ హీరోలు మెల్ల మెల్లగా గుర్తిస్తున్నారు. అందుకే నాగార్జున మరియు వెంకటేష్‌లు మల్టీస్టారర్‌ చిత్రాలు చేసుకుంటూ ఉన్నారు.

ఇప్పటికే వెంకటేష్‌ తన వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా నాగార్జున కూడా వయస్సుకు తగ్గ పాత్రను ఎంపిక చేసుకుంటూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్‌ రెండు మల్టీస్టారర్‌ చిత్రాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ రెండు మల్టీస్టారర్‌ చిత్రాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ముందు కూడా వెంకటేష్‌ వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు చేయాలని భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలు కాకున్నా కూడా వయస్సుకు తగ్గ పాత్రలను మాత్రమే చేస్తాను అంటూ వెంకీ చెబుతున్నాడు.