నాగబాబు గారు కాపాడండి : సూర్య బాధితులు     2018-05-22   01:51:36  IST  Raghu V

రామ్‌ చరణ్‌, జెనీలియాతో ‘ఆరంజ్‌’ చిత్రాన్ని నిర్మించిన నాగబాబు ఆ నష్టాల నుండి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కాని బయట పడలేక పోయాడు. ‘ఆరంజ్‌’ చిత్రంతో నాగబాబు పనైపోయిందని అంతా భావించారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఇంకా కొందరు సాయంగా నిలవడంతో మళ్లీ నాగబాబు నిలదొక్కుకున్నాడు. ఇలాంటి సమయంలో నాగబాబుకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్‌ ఒక సినిమా నిర్మాణ బాధ్యతను అప్పగించాడు. అల్లు అర్జున్‌ డేట్లను నాగబాబుకు ఇచ్చాడు. తక్కువ పారితోషికం తీసుకుని నాగబాబు కోసం ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని చేయడం జరిగింది.

అల్లు అర్జున్‌ డేట్లు ఉన్న నాగబాబు సొంతంగా కాకుండా లగడపాటి శ్రీధర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించాడు. పెద్దగా పెట్టుబడి పెట్టకుండా నాగబాబు సినిమాలో భాగస్వామి అవ్వడంతో నష్టం వచ్చినా, లాభం వచ్చినా పెద్దగా ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమాకు వచ్చిన టాక్‌ నేపథ్యంలో విడుదలకు ముందే నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఈ చిత్రం వల్ల నాగబాబుకు దాదాపు 25 కోట్ల వరకు లాభం దక్కినట్లుగా సమాచారం అందుతుంది. సినిమా సక్సెస్‌ అయ్యి ఉంటే మరో పది కోట్ల వరకు లాభాలు వచ్చేవి. కాని సినిమా నిరాశ పర్చడం జరిగింది.