నల్లని పాదాలను వదిలించుకోవటానికి ఇంటి నివారణలు

అందమైన పాదాలు తేమ, చెమట, ప్రతి రోజు ఎక్కువగా నడవటం, సూర్యరశ్మి వంటి కారణాల వలన నల్లని పాదాలుగా మారతాయి. పాదాలు నల్లగా ఉంటే మనకు ఇష్టమైన బూట్లు మరియు చెప్పులు వేసుకోవటానికి కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. సూర్యకాంతి నేరుగా పడటం వలన మృత కణాలు మరియు పొడి కారణంగా పాదాలు సహజ రంగును కోల్పోతాయి. ఇప్పుడు సహజంగా, కేవలం ఒక వారం రోజుల్లోనే ఇంటి నివారణలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఇక్కడ నల్లని పాదాలను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వినెగర్

ఆపిల్ సైడర్ వినెగర్ ని దాదాపుగా అన్ని రకాల చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు. దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన పాదాల నలుపు తగ్గించటంలో సహాయపడుతుంది. అలాగే స్పష్టమైన మరియు మెరిసే చర్మాన్ని ఇస్తుంది.

కావలసినవి

ఆపిల్ సైడర్ వినెగర్ – 1 స్పూన్

నీరు – 1 స్పూన్

పద్దతి

* మొదట పాదాలను శుభ్రంగా కడగాలి. ఒక బౌల్ లో ఆపిల్ సైడర్ వినెగర్ మరియు నీటిని వేసి బాగా కలపాలి.

* ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సాయంతో పాదాలకు రాయాలి.

* 20 నిముషాలు అయ్యిన తర్వాత చల్లని నీటితో పాదాలను శుభ్రం చేయాలి.

* ప్రతి రోజు ఈ విధంగా చేసిన తర్వాత, పాదాలను శుభ్రంగా పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.