నంద్యాల‌లో పోలింగ్ పెరిగితే ఎవ‌రికి ప్ల‌స్‌… ఎవ‌రికి మైన‌స్‌

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక తెలుగు రాజ‌కీయాల్లోనే కీల‌కంగా మారింది. బుధవారం ఉదయం 7 గంట‌ల నుంచి పోలింగ్ ప్రారంభ‌మైంది. తొలి రెండు గంటల్లోనే భారీ ఎత్తున పోలింగ్ జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2.09 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు. ఓవ‌రాల్‌గా 85 శాతం ఓటింగ్ న‌మోద‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగితే మాత్రం అది వైసీపీకి అత్యంత అనుకూల సంకేతంగా ఉంటుందని.. ఎప్పటిలాగే ఉంటే మాత్రం అది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. పోలింగ్ శాతం పెరిగితే సర్కారుపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను చాటేందుకు ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్లు అవుతుంద‌ని వైసీపీ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి. అయితే ఓటింగ్ పెరిగితే భూమా సానుభూతి బాగా వ‌ర్క్ అవుట్ అవుతుంద‌ని, అది త‌మ‌కే క‌లిసి వ‌స్తుంద‌ని టీడీపీ వ‌ర్గాలు ధీమాతో ఉన్నాయి.