దేవాలయాలకు స్త్రీలు ఎలా వెళ్ళాలి?    2018-05-11   23:55:35  IST 

స్త్రీలు ప్రతి శుక్రవారం గుడికి వెళుతూ ఉంటారు. ఆలా గుడికి వెళ్ళితే సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. అయితే శుక్రవారం గుడికి వెళ్లే స్త్రీలు ఎలా వెళ్ళాలి. మన పెద్దలు స్త్రీలు గుడికి ఎలా వెళ్లాలో కూడా చెప్పారు. చీర,లంగా,ఓణీ వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి. అలాగే నుదుట కుంకుమ ధరించాలి. గుడిలో ఇచ్చే పసుపు,కుంకుమను నుదుటి కుంకుమ కింద,విభూతి అయితే నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి.

ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పుతున్నారు. వినాయకుని గుడికి వెళ్ళితే గరిక మాలను తీసుకువెళ్లాలి. గరిక మాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తిరటమే కాకుండా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది.