దూసుకుపోతున్న జగన్ .. దాటుకుపోతున్న పవన్     2018-06-11   01:32:01  IST  Bhanu C

రోజుకో సర్వే బయటకి వస్తోంది .. రాజకీయ పార్టీలకు దడ పుట్టిస్తోంది ! అంతర్గతంగా ఆయా పార్టీల సర్వేలు చేయించుకోవడం .. ఆ సర్వేల్లో ఏమి తేలినా … బయటకి మాత్రం అదిగో సర్వే… మా పార్టీకి ప్రజల్లో విశ్వాసం సంపాదించింది. గెలవబోయేది మేమే అంటూ సొంత డబ్బాలు కొట్టుకోవడం మాములే. అయితే వాటి సంగతి పక్కనపెడితే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు బయాపెడుతున్న సర్వే రిపోర్టులు మాత్రం పార్టీలను కంగారు పెట్టేస్తున్నాయి.

ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక చంద్రబాబునాయుడు నాలుగేళ్ళ పాలన పై సర్వే జరిపిందట. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చంద్రబాబుకు పెద్ద షాకే తగిలింది. దినపత్రికి వివిధ అంశాలపై రాష్ట్రంలో సర్వే నిర్వహించిందట. వచ్చే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారని అడిగిన ప్రశ్నకు 42 శాతం మంది జగన్‌కే ఓటేస్తామన్నారట. తమ ఓటు చంద్రబాబుకే అన్నవాళ్ళు 30 శాతమేనట. పవన్ కల్యాణ్ కు 19 శాతం మంది మద్దతు ఇచ్చారని వరుసగా కధనాలు వస్తున్నాయి.