దాని వల్ల తెగ ఫీల్‌ అవుతున్న నాగచైతన్య     2018-06-22   23:51:48  IST  Raghu V

టాలీవుడ్‌లో కొన్ని సార్లు కొన్ని చిత్రాలు ఒక హీరో చేయాల్సింది మరో హీరో చేస్తూ ఉంటాడు. ఆ సినిమాలు సక్సెస్‌ అవ్వొచ్చు, అవ్వక పోవచ్చు. పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్లిన రెండు మూడు సినిమాలు రవితేజ చేశాడు. రవితేజ ఆ చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్నాడు. ఇంకా పలువురు హీరోలు కూడా ఇతర హీరోల సినిమాలను పొరపాటున చేసి, సక్సెస్‌లు దక్కించుకున్నారు. తాజాగా నాగచైతన్య చేయాల్సిన చిత్రాన్ని సుధీర్‌బాబు చేసి సక్సెస్‌ దక్కించుకున్నాడు. సుధీర్‌బాబు చాలా సంవత్సరాల తర్వాత సక్సెస్‌ను ‘సమ్మోహనం’ చిత్రంతో దక్కించుకున్న విషయం తెల్సిందే.

‘సమ్మోహనం’ చిత్రంను మొదట దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగచైతన్యతో చేయాలని భావించాడు. రెండు మూడు సార్లు కథను చైతన్యకు చెప్పడంతో పాటు కథను చైతూకు అనుకూలంగా మార్చడం కూడా జరిగింది. అయినా కూడా అంతకు ముందే ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు రాలేదు. నాగచైతన్య ‘సమ్మోహనం’ చిత్రం చేసి ఉంటే ఫలితం మరింత పాజిటివ్‌గా ఉండేది అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ‘సమ్మోహనం’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో నాగచైతన్య ఫీల్‌ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.