తల్లి బయటకి వెళ్ళగానే...టీవీ సీరియల్ చూస్తూ ఆ చిన్నారి ఏం చేసిందో తెలుస్తే షాక్.!     2018-06-11   00:53:54  IST  Raghu V

టీవీ సీరియల్‌లో వచ్చిన ఆత్మహత్య సీన్‌ను అనుకరించిన ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కోల్‌కతా ఇచ్చాపుర్‌ పట్టణంలో జరిగింది. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆ చిన్నారి రెండు నెలల తమ్ముడు మినహా ఇంట్లో ఎవరూ లేరు. బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడానికి ఆ చిన్నారి తల్లి బయటకు వెళ్లగా… తండ్రి రోజువారి పని మీద వెళ్లాడు.

2 నెలల బాబు మాత్రమే ఉన్నాడు. అయితే ఆ తల్లి తన పిల్లలను ఓ కంట కనిపెట్టమని, పక్కింటి వారికి కూడా చెప్పింది. కానీ ఆమె తిరొగొచ్చేసరికి స్కార్ఫ్‌తో ఉరేసుకున్న తన బిడ్డ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు.