తండ్రి టీ అమ్మితే ఆ కష్టానికి తన ప్రతిభ తో కోట్లు సంపాదించిన కూతురు     2018-06-20   02:29:55  IST  Bhanu C

ఆమె భారత్ లో పేద కుటుంభానికి చెందిన విద్యార్ధిని ఆమె తండ్రి చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని నడుపుతున్నాడు..అయితే అతడి కూతురుకి అమెరికాలోని మస్సాచుసెట్స్‌లోని బాబ్సన్ కళాశాలలో స్కాలర్‌షిప్ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3.8 కోట్ల స్కాలర్‌షిప్ అందించడమే కాకుండా ప్రతిష్టాత్మక బాబ్సన్ కాలేజీలో చదివే అవకాశం అందించింది..వివరాలలోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బులందషహర్‌కు చెందిన “సుదీక్ష భాటి” పన్నెండో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకొని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది…ఆమెది పేద కుటుంభం తండ్రి టీ అమ్మిన సొమ్ముతోనే కుటుంభాన్ని పోషిస్తున్నాడు ఫీజు కట్టక పోవడం వలన ఓ స్కూల్ యాజమాన్యం ఇంటికి పంపేసింది..దాంతో ఆమెని ఊళ్లోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించాడు. డబ్బు కట్టలేక ఆ పాఠశాలకు వెళ్తున్న ఆమెను కొందరు హేళన చేసేవారు.