టీడీపీలో కొత్త స్వరం .. తెరపైకి జూ.ఎన్టీఆర్ !     2018-05-29   00:13:50  IST  Bhanu C

తెలుగుదేశం పార్టీలో మెల్లమెల్లగా ముసలం స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు ఉన్న టీడీపీ మాకు వద్దు అసలు సిసలు టీడీపీ కావాలి అనే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అంటే ఇప్పుడున్న టీడీపీ అసలు టీడీపీ కాదా అనే ప్రశ్నకు వారు చెప్తున్నా సమాధానం … ఇప్పుడు ఉన్నదీ చంద్రబాబు టీడీపీ , అసలుసిసలు టీడీపీ అంటే ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ అని వారు చెప్తున్నారు. అప్పటి టీడీపీ కి విలువలు ఉండేవి .. ఇప్పుడు టీడీపీ దిగజారుడు రాజకీయాలకు దిగిపోయింది అందుకే అన్నగారు పోరాడిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది. మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు తప్పుకుని నందమూరి వారసులకు పార్టీ ని అప్పగించాలి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీని అప్పగించాలనే డిమాండ్ ఎక్కువ అవుతోంది.

చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికే తెలంగాణలో టీడీపీని భూ స్థాపితం చేసి, ఏ సిద్ధాంతాలను నమ్మి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారో.. వాటిని కాలరాస్తూ కాంగ్రెస్ కాళ్లదగ్గర పార్టీని పెడుతున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత చంద్రన్న టీడీపీగా మార్చేశారు బాబు. పదేళ్ల ప్రతిక్షంలో ఉన్నా.. ఎప్పుడూ చంద్రబాబు నాయకత్వాన్ని.. వద్దనని టీడీపీ నేతలు, అభిమానులు ఇక ఆయన తప్పుకుంటేనే టీడీపీ బ్రతికి బట్టకడుతుందని అంటున్నారు.