టీఅర్ఎస్ కు ముందస్తు ధీమా ! అందుకేనా కారు స్పీడ్ పెరిగింది     2018-06-24   23:37:55  IST  Bhanu C

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజయం పై ధీమా పెరిగిపోయింది. ఎన్నికలు ఎప్పడొచ్చినా ఎదుర్కోవడమే కాదు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతామని సేపదం కూడా చేసేస్తున్నాడు. దీనికి తోడు సర్వే లెక్కలు కూడా టీఆర్ఎస్ విజయం ఖాయమని తేల్చేసాయని కేసీఆర్ చెప్తున్నాడు. పనిలోపనిగా ఏపీ పై కూడా తనదైన శైలిలో విమర్శల బాణాలు వదిలాడు. దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ అనేక ఆసక్తికర అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ప్రధానమంత్రితో అంతకు ముందే సమావేశం అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ముందస్తు కసరత్తులో మునిగిపోయారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆక్టోబర్ డెడ్‌లైన్ అధికారులకు విధించారు.