టాలీవుడ్ హీరోలు వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు.. అవి చేసి ఉంటే ఇప్పుడు వేరేలా ఉండేది. ఆ హిట్ సినిమాలు ఎంటో చూడండి.     2018-05-23   03:45:32  IST  Raghu V

సినీ పరిశ్రమలో సక్సెస్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు అంచనా వేయలేరు , ఒక్కొక్కప్పుడు సూపర్ హిట్ అవుతుంది అనుకునే కథలు డిజాస్టర్లు అవుతాయి , సినిమా మీద ఏమి అంచనాలు లేకుండా విడుదల అయి భారీ విజయాలు సొంతం చేసుకున్న సినిమా లు కూడా ఉన్నాయి.ఈ కథల ఎంపిక విషయం లో చాలా హిట్ కథలను మిస్ చేసుకున్నారు , కొన్ని కథలు నచ్చిన డేట్స్ కుదరక మరికొన్ని సినిమాలను వారి ఇమేజ్ కి సరిపోవని వదిలేసుకున్నారు. ఆ కథలేంటో చూద్దాం.

1.అర్జున్ రెడ్డి

తెలుగు సినిమాలో శివ తరువాత అంత ట్రెండ్ సృష్టించిన సినిమా అర్జున్ రెడ్డి. ఎన్నో వివాదాల మధ్య విడుదలై భారీ హిట్ గా నిలిచింది కానీ ఈ కథ ముందుగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కి వినిపించాడు అది కుదరక శర్వానంద్ కి చెప్పాడు , శర్వానంద్ కి కథ నచ్చిన తన ఇమేజ్ కి ఇలాంటి బోల్డ్ కథ సెట్ అవదేమో అని వదులుకున్నాడు, ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కాని శర్వానంద్ మాత్రం వదులుకున్నందుకు చాలా బాధ పది ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమా ని తమిళ్ లో విక్రమ్ కుమారుడు చేస్తున్నాడు దీనికి తమిళ్ దర్శకులు బాల దర్శకత్వం చేస్తున్నాడు. ఇప్పుడు మన అర్జున్ రెడ్డి బాలీవుడ్ కు కూడా వెళ్లింది దీన్ని సందీప్ వంగ నే దర్శకత్వం చేస్తున్నాడు ఇందులో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.

2. సింహాద్రి

జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కి చాలా చేరువలో వచ్చింది , ఈ సినిమా తో చిరంజీవి గారి స్థాయి మార్కెట్ ను పెంచుకున్నారు తారక్. అయితే ఈ కథ రాసిన రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను బాలకృష్ణ కోసం తయారు చేసాడట , అది కుదరకపోవడం తో రాజమౌళి గారికి మళ్ళీ ఎన్టీఆర్ అవకాశం ఇవ్వడం వల్ల సింహాద్రి తీశారు.