జ‌గ‌న్ కొంద‌రి వాడా..? అంద‌రివాడా?     2018-05-05   02:26:18  IST  Bhanu C

విప‌క్ష నేత, వైసీపీ అధినేత జ‌గ‌న్ కొంద‌రి వాడా? అంద‌రివాడా? అనే చ‌ర్చ సాగుతోంది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ విధమైన చ‌ర్చ సాగ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేత‌ల‌ను మ‌రింత‌గా క‌ల‌వ‌ర పెడుతోంది. రాష్ట్రం అనేక సామాజిక వ‌ర్గాల స‌మాహారం. అయిన‌ప్పుడు అంద‌రికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కానీ, జ‌గ‌న్ వ్య‌వ‌హారం చూస్తే.. దీనికి భిన్నంగా క‌నిపిస్తోంది. కాపు సామాజిక‌వ‌ర్గం, ఎంఆర్ పీఎస్‌, బీసీల్లోని మేజ‌ర్ సామాజిక వ‌ర్గాలు.. బ్రాహ్మ‌ణ వ‌ర్గం ఇలా దేనిని చూసినా.. జ‌గ‌న్‌కు అంత అనుకూల వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గంతో క‌లిసిపోయేందుకు, ఆ వ‌ర్గాన్ని ఓన్ చేసుకునేందుకు కూడా జ‌గ‌న్ ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌డం లేద‌ని స‌మాచారం.

అధికార టీడీపీతో పోల్చి న‌ప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా పెద్ద‌గా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఏదైనా సామాజిక వ‌ర్గానికి చెందిన నేత పార్టీలోకి వ‌స్తున్నాడ‌ని లేదా రావాలని అనుకుంటున్నాడ‌ని తెలియ‌గానే టీడీపీ అధిష్టానం నుంచి అనేక రూపాల్లో సంప్ర‌దింపులు, చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అదేవిధంగా ఏదైనా సామాజిక‌వ‌ర్గం త‌మ డిమాండ్ల సాధ‌న‌కు ప‌ట్టుబ‌డితే.. ఆయా వ‌ర్గాల‌తో సానుకూల చర్చ‌లు జ‌ర‌ప‌డ‌మో.. లేదా.. వారి హామీల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు వెలువ‌రించ‌డమో జ‌రుగుతోంది. మ‌రిఈ క్ర‌మంలో అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది. ఎంఆర్ పీఎస్ నేత‌లు త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ప‌ట్టుబ‌డితే.. కాదు పొమ్మ‌న్నాడు జ‌గ‌న్‌.