జ‌గ‌న్‌కు బీజేపీ షాక్‌… ఆశ‌లు ఆవిరేనా..!

ఏపీలో విప‌క్ష వైసీపీతో పొత్తుకు బీజేపీ ఆస‌క్తిగా ఉంద‌ని కొద్ది రోజులుగా ఒక్క‌టే వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీ వ్య‌వ‌హారాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు శాసిస్తోన్న మాజీ కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోవ‌డంతో ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తు కంటిన్యూ అయ్యే ఛాన్సులు లేవ‌న్న టాక్ వ‌చ్చేసింది. ఏపీలో తాజాగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా ఇందుకు ఊత‌మిస్తున్నాయి.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ బీజేపీతో పొత్తుకు త‌హ‌త‌హ‌లాడిపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక నిన్న‌టి వ‌ర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో భేర‌సారాలు ఆడిన‌ట్టు కూడా స‌మాచారం. ముందుగా జ‌గ‌న్ బీజేపీకి 10-12 ఎంపీ సీట్లు ఇస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక 30 వ‌ర‌కు ఎమ్మెల్యే సీట్లు కూడా ఇచ్చేందుకు జ‌గ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.