జ్వరం తగ్గటానికి పది ప్రభావవంతమైన ఇంటి నివారణలు

మన శరీరం ఇన్ ఫెక్షన్ లేదా ఫ్లూ మీద పోరాటం చేసినప్పుడు జ్వరం వస్తుంది. జ్వరంను అణచివేయడానికి సలహా లేదు. ఎందుకంటే బాక్టీరియా మరియు వైరస్ లను చంపటానికి జ్వరం సహాయపడుతుంది. అయితే అధిక జ్వరం (హై ఫీవర్) అనేది చిన్న పిల్లల్లో చాలా ప్రమాదకరం. అధిక జ్వరం (హై ఫీవర్) ని తగ్గించుకోవటానికి సహజమైన మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఒక టబ్ లో గోరువెచ్చని నీరు మరియు అరకప్పు వెనిగర్ పోయాలి. ఆ టబ్ లో 10 నిముషాల పాటు ఉండాలి.

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ తులసి ఆకులను వేసి కొంచెం సేపు కదపకుండా ఉంచాలి. ఈ నీటిని రోజులో నాలుగు సార్లు త్రాగాలి. మరుసటి రోజు కూడా జ్వరం ఎక్కువగా ఉంటే, జ్వరం తగ్గి చెమట పట్టటానికి పిప్పరమెంటు,యారో వంటి మూలికలను కూడా ఉపయోగించవచ్చు.