జుట్టుకు హెన్నా(గోరింటాకు)తో ఉన్న అసాధారణ ఉపయోగాలు

ఔషధ మొక్క అయిన హెన్నా(గోరింట) ను మెహందీ, పన్వర్,సుది అని పిలుస్తారు. ఈ మొక్క అనేక శాఖలతో మధ్య తరహా పొదగా పెరుగుతుంది. ఈ మూలికను అనేక ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ హెన్నా యొక్క కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.

శీతలీకరణ ఏజెంట్
హెన్నా ఒక గొప్ప శీతలీకరణ ఏజెంట్ అని చెప్పవచ్చు. గీతలు మరియు కాలిన గాయాలకు ఉపశమనాన్ని ఇస్తుంది. అధిక జ్వరం లేదా వేడి వలన కలిగిన అలసట ఉన్నప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించటానికి దీనిని ఒక సహజమైన ఇంటి హెర్బ్ గా ఉపయోగించవచ్చు.

తలనొప్పి
సూర్యకాంతి వేడి వలన వచ్చే తలనొప్పిని తగ్గించటానికి గోరింట పువ్వులను ఉపయోగించవచ్చు. గోరింట పువ్వులను క్రష్ చేసి వెనిగర్ లో కలిపి పేస్ట్ చేసి నుదుటి మీద రాయాలి. అలాగే హెన్నా ప్లాస్టర్ ని కూడా ఉపయోగించవచ్చు.