జామ ఆకులలో ఎన్ని సౌందర్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?  

జామకాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం మనకు తెలిసిందే. అలాగే జామ ఆకుతో ఎన్నో చర్మ సమస్యలకు పరిష్కారం చూపవచ్చు. జామాకులో యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుస్కుందాం.

జామ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో కొంచెం పసుపు కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు సెహస్తు ఉంటే బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.