జలుబు మాయం కావాలంటే పుదీనా ఆవిరి….పుదీనాతో మరిన్ని ఉపయోగాలు

వానలు ప్రారంభం అయ్యాయి. ఈ వానలతో పాటు దగ్గు,జలుబు వంటివి కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. మందులను ఉపయోగించకుండా మనకు అందుబాటులో ఉండే పుదీనా తో సులభంగా తగ్గించుకోవచ్చు. పుదీనా దగ్గు,జలుబు వంటి వాటిని తగ్గించటమే కాకుండా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. పుదీనా ఉపయోగాలను తెలుసుకుంటే మీరు పుదీనాను ప్రతి రోజు తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకుంటారు.

జలుబు,దగ్గుతో బాధపడుతున్నప్పుడు మరిగే నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టినప్పుడు నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఈ విధంగా ఆవిరి పట్టటం వలన గొంతు,ముక్కు,నోరు శుభ్రపడి ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది.