జలుబు దగ్గుతో ఇబ్బందిగా ఉందా ? ఐతే మీ ఇంట్లో పసుపు,తులసి ఉన్నాయా?

వానాకాలం వచ్చిందంటే చాలు జలుబు,దగ్గు సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జలుబు వచ్చిందంటే ఒంటి నొప్పులు,గొంతు నొప్పి వంటివి కూడా వచ్చేసి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. పెద్దవాళ్ళు ఎదో ఒక రకంగా తట్టుకుంటారు. కానీ పిల్లలు అయితే తట్టుకోవటం చాలా కష్టం. అందువల్ల వారి కోసం కొన్ని ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.

వాము


పొడి దగ్గు వచ్చినప్పుడు సమయంలో కన్నా రాత్రి సమయంలో ఎక్కువగా వేధిస్తుంది. దాంతో నిద్ర కూడా సరిగా పట్టదు. రాత్రి పడుకొనే ముందు చిటికెడు వామును బుగ్గలో పెట్టుకొని నిదానంగా నములుతూ రసాన్ని మింగితే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

తులసి


దగ్గును తగ్గించటంలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయం నాలుగు తులసి ఆకులను నమిలితే సరిపోతుంది. తులసిలో కఫాన్ని తగ్గించే లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

దాల్చినచెక్క


దాల్చినచెక్కలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌లను నివారించే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన జలుబు నుండి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి రోజులో 2 నుండి 3 సార్లు తీసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.